గుండెపోటుతో కౌన్సిల‌ర్ క‌న్నుమూత‌

తాండూరు రాజకీయం వికారాబాద్

గుండెపోటుతో కౌన్సిల‌ర్ క‌న్నుమూత‌
– అంజలి ఘ‌టించిన వికారాబాద్ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: గుండెపోటుతో వికారాబాద్ మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ ఆర్నర్సింలు క‌న్నుమూశారు. ఈ సంఘ‌ట‌న ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. నర్సింలు  సాయంత్రం త‌న నివాసంలో టీవీ చూస్తుండ‌గా పిల్ల‌లు పాము.. పాము.. అని అరవ‌డంతో ఆందోళ‌న చెందిన ఆయ‌న బ‌య‌ట‌కు ప‌రుగులు పెడుతూ కుప్ప‌కూలీ పోయారు. గ‌మ‌నించిన కుటుంభీకులు స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు దృవీక‌రించారు. నర్సింలు కొన్నేళ్లుగా రాజ‌కీయంలో కొన‌సాగుతూ పేరు ప్రఖ్యాత‌లు పొందారు. గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కౌన్సిల‌ర్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆయ‌న అకాల మ‌ర‌ణంప‌ట్ల ప‌లువురు దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ మ‌ర‌ణ‌వార్త తెలిసిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ మెతుకు ఆనంద్ నివాసానికి చేరుకుని భౌతిక ఖాయానికి పూల‌మాల వేసి అంజ‌లి ఘ‌టించారు. అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు.