స్మార్ట్ బిల్లింగ్ మిషన్లు..!
– పన్నుల వసూలుకు కొత్త యంత్రాలు
– అన్ని రకాలుగా చెల్లింపుకు అవకాశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ లో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన పన్నుల వసూళ్లకు అడ్డంకులు. తొలగిపోయాయి. పన్నుల వసూళ్ల కోసం అధికారులు ప్రత్యేక యంత్రాలను తెప్పించారు. సాంకేతికతో తయారు చేసిన మిషన్లు కార్యాలయంలో అందుబాటులోకి వచ్చాయి. పూర్తి ఆధునిక పరిజ్ఞానంతో రూపొంచిన యంత్రాలతో స్మార్టుగా వసూలు చేసే సౌకర్యం ఉందని మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. యాక్సిక్ బ్యాంకు ద్వారా మొత్తం 25 యంత్రాలకు నివేధిక కోరగా మొదటి దశలో 10 యంత్రాలు వచ్చాయని తెలిపారు. గతంలో ఉన్న యంత్రాలు ఆప్ డేట్ కాకపోవడంతో పన్నుల వసూళ్లు నిలిచిపోయాయని చెప్పుకొచ్చారు.
కొత్తగా తీసుకవచ్చిన యంత్రాలతో ఆన్ లైన్, లేదా ఆఫ్ లైన్, స్వైప్ మిషన్ల ద్వారా కూడా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కుళాయి బిల్లులు, ఆస్తిపన్నులు, ట్రేడ్ లైసెన్స్ బిల్లులను కూడా చెల్లించవచ్చన్నారు. యజమానులు, ప్రజలు బిల్లులు చెల్లించిన తరువాత రసీదు కూడా పొందవచ్చన్నారు. మరోవైపు తాండూరు మున్సిపల్ లో గత బకాయిలతో పాటు ఈ ఆర్థిక సంఘం లక్ష్యంతో కలిపి మొత్తం 9 కోట్ల పన్నుల వసూళ్లు లక్ష్యంగా ఉన్నాయని చెప్పారు. కొత్తగా వచ్చిన యంత్రాలతో పన్నుల వసూళ్లను వేగవంతం చేస్తామని కమీషనర్ తెలిపారు.
ఇదికూడా చదవండి…

