బీరప్ప స్వామి దేవాలయానికి భూమిపూజ

తాండూరు రాజకీయం వికారాబాద్

బీరప్ప స్వామి దేవాలయానికి భూమిపూజ
– కురువ సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: కురువల ఆరాధ్యుడు బీరప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి తాండూరు కురువ సంఘం నాయకులు భూమి పూజ చేశారు. శుక్రవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కురువ సంఘం ఆధ్వర్యంలో ఈ పూజ ఘనంగా నిర్వహించారు. దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తానని రూ. 1 లక్ష నగదు ఇచ్చి ముందుకు వచ్చిన బిజ్జారం కిష్టప్ప దంపతుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ బీరప్ప దేవాలయ నిర్మాణానికి సంఘం నాయకులు, ప్రజలు తోచినంత సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు, మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, కురువ సోదరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

గంజ్ హమాలీ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక