ప్రజా పాలనలో కాంగ్రెస్ విఫలం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రజా పాలనలో కాంగ్రెస్ విఫలం..!
– లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ పార్టీపై కక్ష్య సాధింపు
– ఆరు గ్యారెంటీల అమలులో ఎగనామం
– ఎన్నికల్లో రేవంత్ సర్కారుకు గుణపాఠమే
– బీసీ కమీషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగ విఫలం అయ్యిందని తెలంగాణ రాష్ట్ర బీ సీ కమీషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు నూలి శుభప్రద్ పటేల్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ఎన్ఎస్పీ ట్రస్టు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రేవంత్ సర్కారు నిర్బంగ పాలన కొనసాగుతుందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీకి 14వేల ఎకరాలు సేకరిస్తే సీఎం రేవంత్ రెడ్డి దానిని రద్దు చేసి.. తన సొంత వారి కోసం లగచర్లలో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేశారని విమర్శించారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీల సామాజిక వర్గాల ప్రజలు వ్యతిరేకించారని అన్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా ముందుకు సాగడంతో ప్రజలు తిరుగుబాటు చేశారని అన్నారు. అధికారులపై జరిగిన దాడి ఘటనను బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిలపై దుష్ప్రచారానికి తెరలేపారని విమర్శించారు.

ఇందులో మూడు కేసులు నమోదు చేయగా.. తెరమీదకు ఒకటే కేసును తీసుకవచ్చారని అన్నారు. మొత్తం 46 మందిపై కేసులు చేస్తే ఇందులో 12 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లు ఉన్నారని, బీజేపీ నేతలు కూడా ఉన్నప్పటికీ సురేష్ ఒక్కన్నే చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీపై కక్ష్య సాధింపుకు పాల్పడిందన్నారు. జమ్మూ కాశ్మీర్ తరహాలో 144 సెక్షన్, ఇంటర్నెట్ సేవల బంద్ పాటించి కాంగ్రెస్ నేతలకు అనుకూలంగా ఉంటూ బీఆర్ఎస్. బీజేపీ పార్టీ, వామ పక్షాల పార్టీ నేతల పట్ల వ్యతిరేకంగా చర్యలకు పాల్పడిందన్నారు. కోర్టులో చట్టం ద్వారా న్యాయం లభిస్తుందన్నారు. అదేవిధంగా ఆరు గ్యారెంటీలలో రేవంత్ సర్కారు ఆర్టీసీ బస్సు ప్రయాణం మినహాయించి మిగతా వాటిని అమలు చేయలె పోయిందన్నారు.

రైతుబంధు, రుణమాఫీ నిధులను అటు, ఇటు మళ్లించి సర్దుబాటు పాలన చేసిందన్నారు. ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెడుతూ రైతులకు, ప్రజలను మభ్యపెడుతూ వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. జిల్లాలో జాతీయ రోడ్డుకు కేంద్ర మంత్రి ద్వారా శంకుస్థాపన చేసి 31 నెలలు గడిచినా పనులు చేపట్టలేదన్నారు. తాండూరు వికారాబాద్ రోడ్డు విషయంలో అదే దోరణిని కనబరిచిందన్నారు. సర్పంచులు, ఎంపీటీసీల పదవి కాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించే సమర్థత ప్రభుత్వానికి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు.

ఇదికూడా చదవండి….

పాముకాటుతో బాలిక మృతి..!