రాజ్యాంగంలో ఓటు హక్కుకు ప్రాధాన్యం
– అందరు బాధ్యతగా వినియోగించుకోవాలి
– తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
– పట్టణంలో ఉత్సహాంగా 2కే రన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజ్యాంగంలో ఓటు హక్కుకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంటుందని, దానిని వినియోగించుకోవడం అందరి బాధ్యత అని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజ్యాంగ దినోత్సవంను పురస్కరించుకుని తాండూరు పట్టణంలో 2కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ పాటు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరయ్యారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి 2కే రన్‌ను సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టణంలోని సెంట్ మార్క్స్ హై స్కూల్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా మంచి ప్రజాస్వామ్యంను ఎన్నుకోవడంలో ఓటు హక్కు కీలకమైందని అన్నారు. మంచి ప్రజాస్వామ్యాన్ని ఏర్పరుచుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 18 ఏండ్లు నిండిన యువతీ, యువకులు ఓటు హక్కు నమోదు చేసుకుని ఎన్నికల్లో బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు. చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు దక్కిందని, దానిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, రెవెన్యూ ఉద్యోగులు, ఆర్పీలు, ఏఎన్ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

