పోలీసుల కస్టడీకీ సురేష్ రాజ్..!
– విచారణకు అనుమతిచ్చిన కోర్టు
– రేపు, ఎల్లుండి పోలీసుల ఎంక్వైరీ
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో ఏ2 నిందితుడు భోగమోని సురేష్ రాజ్ పోలీసుల కస్టడీకి వెళ్లనున్నాడు. మంగళ, బుధవారాల్లో పోలీసులు అతనిని ఎంక్వైరీ చేయనున్నారు. ఈ మేరకు కోడంగల్ కోర్టు అనుమతి ఇచ్చింది. గత నెల 11న దుద్యాల గ్రామసభలో జిల్లా కలెక్టర్ బృందం నిరీక్షిస్తుండగా, ఆ సమయంలో అక్కడికి వెళ్లిన సురేశ్‌రాజ్ లగచర్లలో ప్రజలు అధికారుల కోసం నిరీక్షిస్తున్నారని నమ్మబలకడంతో ఆ గ్రామానికి అధికారుల బృందం వెళ్లింది.
వెంటనే పలువురు దాడికి దిగారు. ఈ కేసులో భారాస మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిపై ప్రధాన నిందితునిగా అభియోగం మోపి అరెస్టు చేశారు. కాగా సురేశ్‌రాజ్ ప్రజలను రెచ్చగొట్టారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో పోలీసులు సురేష్‌ను ఏ2గా చేర్చారు. భోగమోని సురేశ్‌రాజ్ గత నెల 19వ తేదీన కొడంగల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయిన విషయంత తెలిసిందే. ఈ కేసులో నిందితులకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించగా, సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. తాజాగా కోర్టు విచారణకు అనుమతించడంతో పోలీసులు వారి కస్టడీకి తీసుకోనున్నారు.
ఇదికూడా చదవండి…

