సాంకేతిక శిక్షణతో ఉపాధి..!
– కంప్యూటర్ రంగంలో వృద్ధి చెందాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: సాంకేతిక శిక్షణతో యువత ఉపాధి అవకాశాలు పొంది ఆ రంగంలో వృద్ధి చెందాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని డా.బీఆర్ అంబేద్కర్ కంప్యూటర్ సాక్షర్థ మిషన్ ఆర్గనేషన్ ద్వారా ఏఎస్ కంప్యూటర్స్ సాఫ్ట్ స్కిల్స్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై నిర్వహకులతో కలిసి సర్టిఫిక్టెట్లను అందజేశారు.
అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ నేటి ప్రపంచంలో సాంకేతిక రంగం దూసుకుపోతుందన్నారు. కంప్యూటర్ యుగంలో సాంకేతిక శిక్షణ పొందడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా దక్కుతాయన్నారు. ఈ రంగంలో కష్టపడి శిక్షణ పొంది.. నైపుణ్యాన్ని మెరుగు పరుచుకుంటే ఆర్థికాభివృద్ధి చెందవచ్చన్నారు. సాంకేతిక రంగంలో యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు డా.పద్మనాభరెడ్డి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

