కాంగ్రెస్ చెప్పి.. చేస్తుంది..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ చెప్పి.. చేస్తుంది..!
– అభివృద్ధి, సంక్షేమం వైపే నిలబడుతుంది
– విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యం
– చిలుక వాగు ప్రక్షాళనపై దృష్టి
– రూ. 5 కోట్లతో గొల్ల చెరువు నీటి శుద్ధి
– రూ.30 కోట్ల అమృత్ నిధులతో ఇంటింటికి నీళ్లు
– చేసిన అభివృద్ధిని గర్వంగా చెప్పుకుంటా
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– పట్టణంలో ప్రజా పాలన విజయోత్సవాల ర్యాలీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే చెప్పినవన్నీ చేసి తీరుతుందని తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అయిన నేపథ్యంలో మంగళవారం తాండూరులో చేపట్టిన ప్రజా పాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా పట్టణంలోని అంబేదర్ర చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హాయాంలోనే పేదలకు ఇండ్లు, పించన్, రేషన్ కార్డులు అందించిందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు.

మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500లకు గ్యాస్ సిలిండర్ ఇస్తుందన్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. స్కూళ్లలో విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, పుస్తకాలు ఇవ్వడంతో పాటు మెస్ చార్జీలు పెంచి.. క్వాలిటీ ఫుడ్ అందిస్తుందన్నారు. త్వరలో తాండూరులో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటేడ్ స్కూల్ రాబోతుందన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇంటికో ఉద్యోగం అంటూ ఇచ్చిన హామిని విస్మరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 50వేల ఉద్యోగాలు, అందులో 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి సర్కారుకు దక్కుతుందన్నారు.

గ్రూప్-1, డీఎస్సీ నియామకాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేయడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంకు మంచి పేరు రాకుండా విష ప్రచారం చేస్తుందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు, ఫించన్లు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు ఇచ్చి తీరుతుందన్నారు. తాండూరు నియోజకవర్గానికి త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కాబోతుందన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చిలుక వాగు ప్రక్షాళన కోసం టెండర్లను ఆహ్వానించడం జరుగుతుందన్నారు. పట్టణంలోని గొల్ల చెరువులో రూ. 5 కోట్లతో మురుగునీటి శుద్దీకరణ ప్రాజెక్టు చేపట్టడం జరుగుతుందన్నారు.

అదేవిధంగా అమృత్ 2.0 కింద రూ.30 కోట్లతో తాండూరులో ట్యాంకులు ఏర్పాటు చేసి ఇంటింటికి తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతందన్నారు. దీంతో పాటు తాండూరులో అండర్ డ్రైనేజీ ఏర్పాటు కోసం కృషి చేస్తానని అన్నారు. ఏడాది కాలంలో సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో తాండూరు అభివృద్ధికి దాదాపు రూ. 500 కోట్లు సాధించానని ఎక్కడైనా గర్వంగా చెప్పుకుంటానని ఉద్ఘాటించారు. చివరగా పట్టణంలో ప్రజా పాలన విజయోత్సవ సంబరాలలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ప్రజలు బహిరంగా ప్రదేశాల్లో చెత్త వేయకుండా.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్వహింస్తున్న సంకల్పంలో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మరోవైపు కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పట్టణంలోని పురవీధుల్లో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, విజయదేవి, సోమశేఖర్, బోయరవి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, కోఆప్షన్ సభ్యులు వెంకట్రామ్ నాయక్, మార్కెట్ కమిటి డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, నాయకులు చంద్రశేఖర్ గౌడ్, భీమప్ప, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, అధికారులు, ఆర్పీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రేపు అయ్యప్ప స్వామి పడిపూజ