ఇంటర్‌ అర్హతతో వీఆర్వో ఉద్యోగాలు

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఇంటర్‌ అర్హతతో వీఆర్వో ఉద్యోగాలు
– తెలంగాణలో 8 వేల పోస్టులు
– నోటిఫికేషన్, ఎంపిక విధానం ఎలా అంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సర్కారు శుభవార్త అందించబోతోంది. రాష్ట్రం రెవెన్యూ శాఖకి సంబందించిన విలేజ్ రెవెన్యూ అధికారుల వ్యవస్థను మళ్ళీ పునరుద్దరించేందుకు దృష్టిసారించింది. ఇందులో భాగంగా 8,000 పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉద్యోగాలను రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి  భర్తి చేయాలని నిర్ణయించింది.

పోస్టుల వివరాలు, అర్హతలు
తెలంగాణా ప్రభుత్వం కొత్తగా ప్రతి గ్రామ పంచాయతిలో గ్రామ రెవిన్యూ అధికారులను నియమించేందుకుగానూ నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా కసరత్తు చేస్తోంది. 10+2 లేదా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు స్టడీ సర్టిఫికెట్స్ 1st నుండి 7th వరకు, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి. ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- వరకు శాలరీస్ ఉంటాయి. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున TA, DA, HRA వంటి అన్ని అలవెన్సెస్ ఉంటాయి.

ఎంపిక విధానం
గ్రామ రెవిన్యూ అధికారుల పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణా ప్రభుత్వం జిల్లాలలో రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి ఒక్కటే రాత పరీక్ష ఉంటుంది. విలేజ్ రెవిన్యూ అధికారులను ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా గతంలోని 3,000 మందిని నేరుగా రెవిన్యూ శాఖలోకి తీసుకొని, మిగిలిన 8,000 పోస్టులకు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్, డిగ్రీ అర్హతలు వున్నవారికి వేర్వేరుగా రాత పరీక్ష (రెవెన్యూ సేవలే) సిలబస్ గా చేర్చి పరీక్ష పెడతారు.

ఇదికూడా చదవండి…

అన్నదాన సత్రానికి అంకురార్పణ