జిల్లాలో కుటుంబ సర్వే కంప్లీట్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జిల్లాలో కుటుంబ సర్వే కంప్లీట్..!
– 60శాతం డేటా ఎంట్రీ కూడా పూర్తి
– తప్పుల్లేకుండా నమోదుకు ఆదేశాలు
– వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
– మున్సిపల్‌లో డెటా ఎంట్రీ పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్ధిక ఇంటింటి సర్వే వికాబాద్ జిల్లాలో కంప్లీట్ అయ్యిందని, డెటా ఎంట్రీ ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా డేటా ఎంట్రీని పరిశీలించారు. తాండూరు సబ్‌ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌తో కలిసి సర్వే ఎంట్రీ ఎలా చేస్తున్నారని పరిశీలించారు.

ఇప్పటి వరకు ఎంత నమోదు పూర్తి అయ్యిందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమారేటర్ కు ఇచ్చిన పూర్తి సమాచారాన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ లు ఎలాంటి తప్పులు జరుగకుండా పూర్తి స్థాయి లో డేటా ఎంట్రీ చేయాలనీ అన్నారు. డేటా ఎంట్రీ వేగవంతం చేయాలనీ అధికారులకు ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సామాజిక, ఆర్థిక , విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి అయ్యిందని తెలిపారు.

ప్రస్తుతం సర్వే డేటా ఎంట్రీ కూడా 60శాతం పూర్తయ్యిందని వెల్లడించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో డేటా ఎంట్రీని చేపట్టినట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ప్రక్రియను వేగవంతం చేసి మూడు రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తాండూరు మునిసిపాలిటీలలో డేటా ఎంట్రీ చేసేందుకు 50 కంప్యూటర్లను అందించడం జరిగిందని ఆయన తెలిపారు. మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహ రెడ్డి, పెద్దేముల్ ఎంపీడీఓ, అధికారులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఇంటర్‌ అర్హతతో వీఆర్వో ఉద్యోగాలు