ట్రైన్‌లో గంజాయి రవాణా..!

క్రైం తాండూరు వికారాబాద్

ట్రైన్‌లో గంజాయి రవాణా..!
– ప్రయాణికుడి నుంచి 40 కేజీలు స్వాదీనం
– తరలిస్తున్న తమిళనాడు వ్యక్తిపై కేసు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైల్లో గంజాయి తరలిస్తున్న ఓ ప్రయాణికుడు ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి తరలిస్తున్న 40 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ సంఘటన శనివారం జరిగింది. తాండూరు ఎక్సైజ్ సీఐ అనంతయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ డా. నవీన్ చంద్ర ఆదేశాల మేరకు భువనేశ్వర్ నుంచి పూణే వెళ్లే కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైల్లో వికారాబాద్ డీటీఎఫ్ సీఐ ధన్వంత్ రెడ్డి, ఎస్ఐ కోటేశ్వర్లతో కలిసి తాండూరు ఎక్సైజ్ సీఐ అనంతయ్య, ఎస్ఐలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో తమిళనాడుకు చెందిన ఫీటర్ ఫ్రాన్సెస్ అనే వ్యక్తి గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్నట్లు గుర్తించారు.

అతని వద్ద నుంచి దాదాపు 40 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై ఎన్దేపీఎస్ యాక్టు కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం పరిగి జైలుకు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ అనంతయ్య తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్ఐ చంద్రకాంత్, ఎస్ఐ చిన్నరాయుడులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!