బీసీల రాజకీయ పార్టీకి సంపూర్ణ మద్దతు

తాండూరు వికారాబాద్

బీసీల రాజకీయ పార్టీకి సంపూర్ణ మద్దతు
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
– బీసీల మేధోమదనంలో అభిప్రాయ వక్తీకరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : త్వరలో రాబోతున్న బీసీల రాజకీయ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మాజీ చైర్మన్ వకుళా భరణం కృష్ణమోహన్ అధ్యక్షతన జాతీయ సామాజిక వేదిక, బీసీ రాజకీయ ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీల మేధోమధనం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాండూరు నుంచి వెళ్లిన కందుకూరి రాజ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో బీసీలకు ప్రాధాన్యత దక్కాలంటే బీసీలకు రాజకీయ పార్టీ అవరసరమని, త్వరలో బీసీల రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇందుకు రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారం కోసం తమ వంతు తోడ్పాటు ఉంటుందని అన్నారు. బీసీల రాజకీయ పార్టీకి సంపూర్ణ మద్దతు అందిస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో మేధోమదనం వంటి సమావేశాలు నిర్వహించాలని, బీసీలను చైతన్య వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, గిరిజాపురం రమేష్, శ్రీధర్, సయ్యద్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రూ.12.55 లక్షలకు వ్యర్థాల వేలం..!