సమ్మోహన వర్ణం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సమ్మోహన వర్ణం..!
– కళను ప్రతిబింబించిన ముగ్గు
– కోట్రిక ఇంట్లో ఆకట్టుకున్న రంగవల్లిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : సంక్రాంతి పర్వదినానా ప్రతి ఇంటి వాకిలి అందమైన రంగుల ముగ్గులు రూపుదిద్దుకుంటుంది. సప్తవర్ణాల కలయికలో వేసిన రంగవళ్లులు ఆకట్టుకోవడం సహజం. కొన్ని ముగ్గులు అయితే మనసును తాకి సమన్మోహన పరుస్తాయి. తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య నివాసంలో వేసిన ముగ్గు సంక్రాంతి స్పెషల్‌గా నిలిచింది. ఆమె కోడలు, వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంటి వాకిట్లో ముగ్గు వేశారు. నీలి రంగులో శ్రీకృష్ణుడు, రాధాల చిత్రాలతో ముగ్గును వేశారు. శ్రీకృష్ణుడు ఊహల్లో మైమరిచిపోతే రాధా చిత్రం ప్రతిబింబిచేలా.. రాధా శ్రీకృష్ణున్ని తలచుకుంటే ఆయన చిత్రం ప్రతిబింబించేలా రంగవల్లికను తీర్చిదిద్దారు.

కోట్రిక వారి ఇంట్లో వేసిన ముగ్గు పలు వాసవీ మహిళ సంఘం సభ్యుల సామాజిక మాద్యమాలలో వైరల్‌గా మారి అందరిని ఆకట్టుకుంది. కోట్రిక నాగలక్ష్మీ ప్రతి సంక్రాంతికి విభిన్నమైన ముగ్గులు వేసి ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా గత యేడాది జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాలలో నగేశ్వర దేవాలయంలో ప్రతిష్టించిన అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి అందరి మెప్పు పొందారు.

ఇది కూడా చదవండి….

నమో దత్తాత్రేయా..!