ప్రజా సేవలో ముందుకు సాగాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రజా సేవలో ముందుకు సాగాలి
– తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి
– ఘనంగా యువనేత ఎల్లప్ప జన్మదినం
– జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు యువనేత ఎల్లప్ప ప్రజా సేవలో ముందుకు సాగాలని వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం ఎల్లప్ప జన్మదినం సందర్బంగా పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాత శిశు ఆసుపత్రిలల్లో రోగులకు పండ్ల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి హాజరై బీసీ సంఘం జాతీయకార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్‌తో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా జన్మదినం జరుపుకున్న ఎల్లప్పకు శుభాకాంక్షలు తెలిపారు. మునుముందు ప్రజా సేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జన్మదినం సందర్బంగా రోగులకు పండ్లు పంపిణీ చేయడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త పర్యాద రామకృష్ణ, కాంగ్రేస్ నాయకులు అబేద్, యువకులు శివ కుమార్, సాయి, గోవింద్, బాలు, అభి, సంతోష్, అఖిల్,తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

సమ్మోహన వర్ణం..!