అక్రమ ఇసుక, ఎర్రమట్టి రవాణాపై పంజా..!
– దాడులు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారుల
– జిల్లాలో 3 ట్రాక్టర్లు, 3 టిప్పర్లు, జేసీబీ, కారు సీజ్
– 8 మంది అదుపులోకి, 4 సెల్ ఫోన్ల స్వాదీనం
– సీరీయస్ వార్నింగ్ ఇచ్చిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : జిల్లాలో అక్రమంగా ఇసుక, ఎర్రమట్టి రవాణా కార్యకలాపాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పంజా విసిరారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించి 3 ఇసుక ట్రాక్టర్లు, 3 టిప్పర్లు, ఓ జేసీబీ, ఓ కారులను సీజ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఓ ప్రకటనలో కేసు వివరాలను వెల్లడించారు. జిల్లా
టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, SI ప్రశాంత్ వర్ధన్ మరియు టీం అధికారులు జిల్లాలో అక్రమంగా ఇసుక, ఎర్రమట్టి రవాణాపై దాడులు చేపట్టారు. వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధన్నారం గుట్ట నుండి ఎర్రమట్టిని తరలిస్తున్నా 5గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోని 3 ఎర్రమట్టి లోడ్ చేసిన టిప్పర్ వాహనాలు, ఒక జేసీబీ, ఒక కార్, 4 సెల్ ఫోన్లు వారి నుండి స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 1 ట్రాక్టర్, యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పట్టుకొని.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిపై ఆయా పోలీస్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా అక్రమ ఇసుక రవాణా, ఎర్రమట్టి రవాణా కార్యకలాపాలకు పాల్పడినా, ప్రోత్సహించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో ఎవరైనా చట్టవ్యతిరేఖ, అసాంఘిక కార్యకలాపాలు పాల్పడిన, అక్రమంగా రావణాలు జరిపిన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారి ఆంజనేయులు సెల్ నెంబర్ 8712670022 ద్వారా సమాచారం అందించాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

