జామ జ్యూస్ వేరి హెల్దీ..!
– తాగితే అనారోగ్యాలన్నీ పరార్
– సంతాలేమి సమస్యకు పరిష్కారం
– శ్వాసకోస ఇబ్బందులు కంట్రోల్ చసుకోవచ్చు
దర్శిని డెస్క్ : మన పరిసరాలలో ఉన్న జామ చెట్టు ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామ చెట్టు, బెరడు, కాండం, ఆకులు, కాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటితో ప్రమాదకరమైన సమస్యలను కంట్రోల్ చేయవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.జామ ఆకుల్లో ఎన్నో పోషకాలు లభిస్తాయి. వీటితో పలు రకాల సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చని ఇప్పటికే చాలా సార్లు తెలుసుకున్నాం. జామ ఆకులతో చేసిన టీ తాగితే.. శ్వాస సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. జామ పండు, జ్యూస్‌తో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.
జామ ఆకులు ప్రతి రోజూ నమిలి తినడం వల్ల పలు రకాల సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. జామ కాయలు ఎంత ఆరోగ్యకరమో.. జామ ఆకులు కూడా అంతే హెల్దీ. జామ చెట్టు కాండం, బెరడులో కూడా మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. జామ పండు జ్యూస్ తాగితే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతుంది. జామ పండు జ్యూస్‌తో అద్భుతమైన ప్రయోజనాల వల్ల ఒత్తిడితో పోరాడే వారికి జామ పండు జ్యూస్ ఉపశమనం కలిగిస్తుంది. జామకాయలో ఉండే రాగి. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. జామకాయ షుగర్ పేషెంట్లకు కూడా చక్కగా పనిచేస్తుంది.
గ్యాస్, కడుపులో ఎలాంటి సమస్యలున్న ఈ రసాన్ని తాగడం వల్ల తగ్గిపోతాయి. ముఖ్యంగా డయాబెటిస్ పెషేంట్లకు చాలా మేలు చేస్తుంది. ఒకవేళ మీ దంతాలు నొప్పితో బాధ పెడుతున్నట్లయితే జామకులను లవంగాలతో కలిపి మెత్తగా మిక్స్ చేసి దంతాలపై అప్లై చేస్తే నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
ప్రస్తుత కాలంలో అనేక మార్పుల కారణంగా చాలా మంది సంతాన లేమి సమస్యలతో బాధ పడుతున్నారు. వయసు మీద పడుతున్నా పిల్లలు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంతాన సమస్యలను తగ్గించడంలో జామ ఆకులు ఎంతో చక్కగా పని చేస్తాయి. జామ ఆకుల జ్యూస్ తాగితే వీర్య కణాల వృద్ధి బాగా జరుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది. ఆడవారైనా, మగవారైనా ప్రతి రోజూ ఉదయం జామ ఆకుల జ్యూస్ తాగితే ఈ సమస్యలు కంట్రోల్ అవుతాయని ఆరోగ్య నిపునులు చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
ఇదికూడా చదవండి…

