ఇంక సెలవు..!
– మాజీలుగా మున్సిపల్ పాలకవర్గం
– మున్సిపల్లో సన్మానంతో వీడ్కోలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు మాజీలుగా మారారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గ సభ్యులకు అధికారంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాజా మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, తాజా మాజీ కౌన్సిలర్లకు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహా రెడ్డి ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు పట్లోళ్ల రత్నమాల నర్సింలు, సాజిద్ అలీ, కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, అబ్దుల్ రజాక్, ప్రభాకర్ గౌడ్, బోయరవి, వెంకన్న గౌడ్, బోంబీనా, సల్మా ఫాతిమా, ఆఫ్రీన్ జవేరియా, భీంసింగ్, ప్రవీణ్ గౌడ్, బీఆర్ఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్లు వరాల శ్రీనివాస్ రెడ్డి, అశ్విని గుండప్ప, ముక్తార్ నాజ్, ఎర్రం వసంత, బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, మాజీ కౌన్సిలర్లు సాహు శ్రీలత, బాలప్ప, పూజా రజనీకాంత్, బంటారం లావణ్య, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, వెంకట్రామ్ నాయక్, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఇంచార్జ్ శానిటరీ ఇను స్పెక్టర్ వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

