నరేంద్రుడి నాయకత్వాన్ని జై..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నరేంద్రుడి నాయకత్వాన్ని జై..!
– ఢీల్లిలో బీజేపీ గెలుపు చారిత్రాత్మకం
– తెలంగాణలో కూడా అధికారంలోకి రావడం ఖాయం
– తాండూరులో అంబరాన్నంటేలా బీజేపీ నేతల సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ ప్రజలంతా ప్రధాని నరేంద్రమోడి నాయకకత్వానికి జై కొడుతున్నారని, ఢిల్లీలో బీజేపీ గెలుపే ఇందుకు నిదర్శనమని తాండూరు బీజేపీ నాయకులు అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 26 ఏళ్ల తరువాత బీజేపీ అధికారంలోకి రావడం పట్ల శనివారం తాండూరులో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, బీఎస్ఎన్ఎల్ కౌన్సిల్ సభ్యులు గాజుల శాంతుకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖాపురం ఆంజనేయులు, సీనీయర్ నాయకులు పూజారి పాండు, సందీప్ తదితరులు పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ సంబరాలను జరుపుకున్నారు.

సంతోషంగా ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బీజేపీ, నరేంద్ర మోడి నినాదాలతో మార్మోగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అందరు బీజేపీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. అందుకే అవినీతిలో కూరుకుపోయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రజల చేతిలో అధికారం కోల్పోయిందని అన్నారు. 26ఏండ్ల తరువాత బీజేపీ గెలుపు చారిత్రాత్మకమన్నారు. కాంగ్రెస్ పార్టీ, కూటమి పార్టీలు చతికిలపడిపోయాయని విమర్శించారు.

ఉచితాలతో అధికారం కైవసం చేసుకోవచ్చని భావించే రాజకీయ పార్టీలకు దిల్లీ ఎన్నికలు ఓ గుణపాఠంలా నిలుస్తాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కూడా అదే పరిస్థితి తప్పదని, రాబోవు రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాలప్ప, నాయకులు అంతారం కిరణ్‌, హరీష్‌ గౌడ్, నాగరాజు, నర్సింహా, సంగమేష్‌, చంద్రశేఖర్, మంతటి రాజు, ప్రహాల్లాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బరితెగించిన దొంగలు..!