సేవాలాల్ సాక్షిగా నిర్లక్ష్యం..!
– తాండూరులోని విగ్రహం వద్ద అపరిశుభ్రం
– రేపే జయంతి ఉన్నా పట్టించుకోని అధికారులు
– చిన్నచూపు చూడొద్దంటూ బంజారుల విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పట్ల స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తాండూరుకు చెందిన పలువురు గిరిజనులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. తాండూరు పట్టణం బాలాజీ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ విగ్రహం వద్ద అపరిశుభ్రత నెలకొంది. రేపు సేవాలాల్ మహరాజ్ జయంతి నిర్వహిస్తున్నారు. అయితే తాండూరులోని సేవాలాల్ విగ్రహం ఉన్న మరుగు కాలువ పారడంతో పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయని, అధికారులు పట్టించుకోవడం లేదంటూ పలువురు గిరిజనులు మండిపడుతున్నారు. సేవాలాల్ మహరాజ్, గిరిజనుల పట్ల చిన్నచూపు చూడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విగ్రహం వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. పరిసరాలను పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు.
ఇదికూడా చదవండి…

