పాపర్టీ ట్యాక్స్ క్లీయర్..!
– రూ. 1 లక్ష 17 వేల ఆస్తి పన్ను చెల్లింపు
– అధికారులకు అందించిన విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని వినాయక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆస్తి పన్నులను ఆసుపత్రి చైర్మన్, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ చెల్లించారు. గత కొన్ని రోజులుగా తాండూరు మున్సిపల్ అధికారులు ఆస్తిపన్నులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఆసుపత్రికి వెళ్లగా ఆసుపత్రి చైర్మన్ విఠల్ నాయక్ వారితో మాట్లాడి ఆస్తి పన్ను బకాయలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు వెల్లడించిన విధంగా ఆసుపత్రికి సంబంధించిన ఆస్తి పన్ను రూ. 1 లక్ష 17 వేల 450లను ఒకే విడతలో అధికారులకు చెల్లించారు. ఆస్తిపన్నులను క్లియర్ చేసిన సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ బిల్ కలెక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి…

