మానవత్వం చాటుకున్న ఎస్ఐ శంకర్
– మృతి చెందిన బాలుడి కుటుంబానికి ఆర్థిక సాయం
– మంచి మనసును మెచ్చుకున్న ప్రజలు
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : విధి నిర్వహణలో ఎంత కఠినంగా ఉన్న పోలీసులకు కూడా మనస్సు ఉంటుంది. అవసరమైనప్పుడు వారిలో ఉన్న మంచితనం, మానవత్వం చాటుకుంటారు. బషీరాబాద్ మండల ఎస్ఐ శంకర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. మండలంలోని టాకీ తాండాకు చెందిన ఏడేళ్ల శ్రీరామ్ అనే బాలుడు ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. కుమారున్ని కోల్పోయి తీవ్ర విషాధంలో ఉన్న కుటుంబానికి ఎస్ఐ శంకర్ తన వంతు ఆర్థిక సాయం అందజేశారు.
తన సొంతంగా రూ. 10వేల ఆర్థిక సాయాన్ని కుటుంబానికి అందజేశారు. పేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం పట్ల ఎస్ఐ శంకర్ మంచి మనసును మెచ్చుకున్నారు. మరోవైపు ఆర్టీసీ సంస్థ నుంచి కుటుంబానికి రూ. 15వేల ఆర్థిక సాయం కూడా అందించారు. స్థానికంగా రెండో తరగతి చదువుతున్న శ్రీరాం(7) బుధవారం రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా తాండూరు నుంచి క్యాద్గిర వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపించడంతో బస్సు కింద పడి గాయాలపాలై ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.
ఇదికూడా చదవండి…


