వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సం..!
– భద్రేశ్వరాలయంలో మార్మోగిన శివ నామస్మరణ
– కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం వైభోగంగా జరిగింది. ప్రతి యేడాది మాదిరిగానే శివ దీక్షా సేవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం నిర్వహించారు. వేద పండితులు డా. మహంతయ్య స్వామి ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. కళ్యాణోత్సవం ముందు శివపార్వతుల విగ్రహాల ఊరేగింపు శోభాయామానంగా కొనసాగింది.
ఊరేగింపు ముందు ఆనవాయితీగా వస్తున్న స్వాముల ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం దేవాలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భద్రేశ్వర దేవాలయం శివ భక్తులతో కిక్కిరిసి పోయింది. ఈ కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై శివపార్వతులను దర్శించుకున్నారు. అదేవిధంగా కళ్యాణా త్సవం సందర్భంగా శివ స్వాములు ఆలాపించిన భజన కీర్తనలు ఆకట్టకున్నాయి. శివ నామస్మరణతో దేవాలయం మార్మోగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ రేనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కమార్, వీర శైవసమాజం పెద్దలు, సభ్యులు, శివ దీక్షా సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

