తాండూరులో ఫ్రీగా చికెన్, గుడ్ల పంపిణీ..!
– ఎగబడి తీసుకున్న మాంస ప్రియులు
– మల్లప్ప మడిగ వద్ద ట్రాఫిక్ జామ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఫ్రీ గా చికెన్, గుడ్ల పంపిణీ మేళా నిర్వహించారు. గురువారం సాయంత్రం పట్టణంలోని మల్లప్ప మడిగ వద్ద నిర్వహించిన మేళాకు జనం ఎగబడిపోయారు. చికెన్, గుడ్లు తింటే బర్డ్ ప్ల్యూ రాదని ప్రజల్లో భయం పోగొట్టేందుకు ఓ వ్యాపారి వినూత్న కార్యక్రమం చేపట్టారు. చికెన్, ఎగ్ వంటల మేళా ద్వారా బర్డ్ ప్ల్యూ ప్రచారాన్ని పటాపంచలు చేయడానికి చికెన్, ఎగ్స్ తో తయారు చేసిన వంటలు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. చికెన్ ఫ్రై తినడం కోసం ప్రజలు ఎగబడ్డారు. ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు చికెన్, ఎగ్ మేళా నిర్వహించామని చెబుతున్నారు. ప్రజల్లో అపోహను తొలగించడం కోసమే నిర్వహించిన ఎగ్ మేళాకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాసేపట్లోనే మల్లప్ప మడిగ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఇదికూడా చదవండి…

