లారీ డ్రైవర్ రిమాండ్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

లారీ డ్రైవర్ రిమాండ్..!
– తండ్రీ కొడుకుల మృతిలో అదుపులోకి
– వెల్లడించిన కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చెంగోల్ గ్రామ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతికి కారణమైన లారీ డ్రైవర్ ను రిమాండుకు తరలించినట్లు కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు గోపయ్య గౌడ్, నర్సింలు గౌడ్ శుక్రవారం ఉదయం స్కూటీ పై వస్తుండగా బైపాస్ రోడ్డు వద్ద అతివేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో వారిద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు లారీ డ్రైవర్ మైనోద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో నిందితున్ని కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలను నడిపించరాదని, తాగి వాహనాలు నడిపించి రోడ్డు ప్రమాదాలకు కారణమైతే జైలుకు తప్పదని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

పేదల ఆరోగ్యానికి సర్కారు ప్రాధాన్యం