పేకాట ఆడుతూ.. దొరికిపోయారు..

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

– న‌లుగురిపై కేసు
ద‌ర్శిని ప్ర‌తినిధి, తాండూరు : పేకాట ఆడుతున్న న‌లుగురుని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ సంఘ‌ట‌న సోమ‌వారం తాండూరు ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్‌రెడ్డి తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. తాండూరు ప‌ట్ట‌ణానికి చెందిన బోర్ వినోద్, రాహుల్ గైవ‌త్, సిందే య‌శ్వంత్, దుర్వే ఎల్ల‌ప్ప‌లు
సాయంత్రం వేళ‌ ప‌ట్ట‌ణంలోని గ‌గ్రాని ఫంక్ష‌న్ హాల్ స‌మీపంలో పేకాట ఆడుతున్న‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని నిందితుల‌ను అదుపులోకి తీసుకుని పోలీస్టేష‌న్‌కు త‌ర‌లించారు. వారి వ‌ద్ద నుంచి రూ. 3070ల న‌గ‌దును స్వాదీనం చేసుకుని, వారిపై కేసు న‌మోదు చేయ‌డం జ‌రిగింద‌ని సీఐ రాజేంద‌ర్‌రెడ్డి తెలిపారు.