ఇంటిగ్రేటేడ్ స్కూల్కు గ్రీన్ సిగ్నల్..!
– నిర్మాణంకు రూ. 200 కోట్లు మంజూరు
– ప్రకటించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదివారం క్యాంపు కార్యాలయం ద్వారా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలతో పాటు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో తాండూరుకు ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తాండూరులో సర్వేనెంబర్ 51లో నిర్మించాలని ప్రతిపాదించిన ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణంకు ప్రభుత్వం ఆర్థిక ఆమోదం తెలిపినట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక శాఖ ఆమోదంతో రూ.200 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తాండూరులో విద్యా వ్యవస్థను మెరుగు పరచడంలో భాగంగా ఇంటిగ్రేటేడ్ స్కూల్ తీసుకరావడం జరుగుతుందని, ఇందకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న కృషికి పార్టీ నేతలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

