జననేతకు నీరాజనాలు..!
– నూరేళ్లు వర్దిల్లాలని గుళ్లలో పూజలు
– వాడ వాడలా కేక్ కటింగ్‌లు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)కు వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గ ప్రజలు నీరాజనాలు అర్పిస్తున్నారు.

శుక్రవారం సీఎం కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలను తాండూరులో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు పట్టణంలోని వెలసిన దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. వాడ వాడల్లో కేక్‌లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా కోకట్ రోడ్డు మార్గంలోని షిర్డీ సాయి మందిరంలో, పాత తాండూరులోని బోనమ్మ దేవాలయంలో, పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో, అయ్యప్ప నగర్‌లోని ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో పూజలు వైభవంగా నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమాల్లో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు హరి హరగౌడ్, భ్రదేశ్వరాల దేవాయల చైర్మన్ బంటారం సుధాకర్, వివిధ దేవాలయాల చైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొని సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలంటూ దేవతలకు పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ వార్డుల్లో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ్‌కీ నేత సీఎం కేసీఆర్ అంటూ.. సంక్షేమ ప్రధాత.. కారణ జన్ముడు అండూ సీఎం కేసీఆర్‌కు నీరాజనాలు పలికారు. సీఎం కేసీఆర్ జన్మదిన సంబరాలతో తాండూరు పట్టణం మురిసిపోయింది.
ఈ వార్తను సమర్పించిన వారు


