వీరశైవ లింగాయత్ లింగ బలిజల అభివృద్ధికి కృషి చేయాలి
– సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు డా. వెన్న ఈశ్వరప్ప
– తాండూరులో ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అభివృద్ధికి అందరు కృషి చేయాలని ఆయ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు డా. వెన్న ఈశ్వరప్ప అన్నారు. ఆదివారం తాండూరులో వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులు డా. వెన్న ఈశ్వరప్ప చేతుల మీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి సంఘం సభ్యులు సహాకారం అందించాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ద్వారా సంఘం కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్ తదితర అభివృద్ధి సహాకారాలను పొందాలన్నారు.
అనంతరం పలువురు సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయం మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ అడ్వయిజరీ మెంబర్ గాజుల శాంతుకుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దర్మీది ప్రభు, జిల్లా కార్యవర్గ సభ్యులు శివకుమార్, చంద్రకాంత్, అడ్వకేట్ నరేష్, మండల అధ్యక్షులు పూడూరు శ్రావణ్ కుమార్, సంగమేశ్వర్, ఆకుల బస్వరాజ్, సూర్యకాంత్, యువదళ్ సభ్యులు, నగర ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్, కోశాధికారి తుప్పు శేఖర్, వివిధ మండలాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

