పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం తగదు..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం తగదు..!
– అలసత్వాన్ని వీడకుంటే సస్పెండ్ వేటే
– మున్సిపల్ రాష్ట్ర జేడీ బి. శ్రీనివాస్ ఆదేశం
– పన్నుల వసూళ్లపై ప్రత్యేక సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆస్తి, కుళాయి పన్నుల వసూళ్లలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ హెచ్చరించారు. ఆస్తి పన్నుల వసూళ్లలో తాండూరు మున్సిపల్ అట్టడుగు స్థాయిలో ఉంది. పన్నుల వసూళ్లపై కఠినంగా వ్యవహరించాలని మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవీ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ ను ఆదేశించారు.

ఈ మేరకు ఆయన ఆదివారం తాండూరు మున్సిపల్ ను సందర్శించారు. మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పట్టణంలో పర్యటించారు. మున్సిపల్ కు బకాయిలు ఉన్న పలు వాణిజ్య, వ్యాపార దుకాణా సముదాయాల వద్దకు వెళ్లి పన్నులను వసూలు చేశారు. అనంతరం జేడీ శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్తో, బిల్ కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్నుల వసూళ్లలో తాండూరు మున్సిపల్ కేవలం 33 శాతం వసూలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆస్తి పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శించడం అసహనం వ్యక్త పరిచారు. లక్ష్యానికి అనుగుణంగా పన్నులు వసూలు చేసేందుకు కఠినంగా శ్రమించాలన్నారు. వసూళ్ల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సస్పెండ్ చేసేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. గడువులోగా లక్ష్యాన్ని అధిగమించేలా వసూళ్లను చేపట్టాలని ఆదేశించారు.

ఇదికూడా చదవండి…

రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేయాలి