హిందూ ఉత్సవ సమితి కార్యవర్గం ఎన్నిక

తాండూరు రాజకీయం వికారాబాద్

హిందూ ఉత్సవ సమితి కార్యవర్గం ఎన్నిక
– ప్రకటించిన అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సమితి అధ్యక్షురాలు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ప్రధాన కార్యదర్శి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలులు వెల్లడించారు.
kvcs
మంగళవారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని హిందూ ఉత్సవ సమితి స్థలం వద్ద సమావేశం ఏర్పాటు చేసి కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇప్పటికే సమితి గౌరవాధ్యక్షులుగా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, అధ్యక్షురాలుగా స్వప్న పరిమళ్, ప్రధాన కార్యదర్శిగా పట్లోళ్ల నర్సింలు, కోశాధికారిగా రొంపల్లి సంతోష్ లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. తాజాగా ఉపాధ్యక్షులుగా తర్లపల్లి భాను కుమార్, గూలి పరమేశ్వర్ స్వామి, మణపురం రామకృష్ణ, బాతుల నాగరాజ్, డి.శ్రీకాంత్ రెడ్డి, అల్లాపురం శ్రీకాంత్, శ్రీకాంత్ రెడ్డి, అంతారం రమేష్, కోటం ప్రసాద్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు.

అదేవిధంగా సహా కార్యదర్శులుగా పరమతి వెంకటేశం (మిర్చి), మంతన్ గౌడ్ అశోక్, కోట్ల రాజ్ కుమార్, రాజేందర్ రెడ్డి, హరిప్రసాద్ గౌడ్, బీడే లోకేష్, సందీప్ రెడ్డి, రజక నర్సింహా, వడ్డె పరమేష్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు. అధికార ప్రతినిధిగా పర్యాద రామకృష్ణను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా కార్య నిర్వహాక కార్యదర్శులుగా బోయ రాజు, అనిల్ గౌడ్, గోపాల్ చౌహాన్, సాంస్కృతిక కార్యదర్శులుగా దావులయ్య, తట్టేపల్లి నరేష్, దేవగారి రమేష్, సమన్వయ కమిటి సభ్యులుగా జుంటుపల్లి వెంకట్, సురేష్ నాయక్, ఎస్. వెంకటేష్, దివిటి ఎల్లప్ప, బీజే దత్తు, ఎస్. ప్రవీణ్, మధు, గౌడంపల్లి వసంత్, ప్రచార కార్యదర్శులుగా తాండ్ర నరేష్, కుమార్ వాల్మీకీ, గోపాల్, న్యాయ సలహదారులుగా పాశం రవికుమార్, మిస్కిన్ దేవరాజ్, ఆధ్యాత్మిక సలహాదారులుగా మడపతి సిద్దిలింగయ్య స్వామిలను ఎన్నుకున్నట్లు తెలిపారు.

వీరితో పాటు ముఖ్య సలహా దారుల కమిటిని కూడా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు స్వప్న పరిమళ్, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలులు మాట్లాడుతూ వచ్చే వినాయక చవితితో పాటు అన్ని పండగలు ప్రశాంతంగా నిర్వహించేలా హిందూ ఉత్సవ సమితి కృషి చేస్తుందని అన్నారు. ఇందుకు సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

సీఎం రేవంత్ రెడ్డితో మనోహర్ రెడ్డి భేటీ