ఇంకొంచెం.. చేయూత చాలు..!
– వశిష్ట వైద్యానికి సమకూరుతున్న నిధులు
– తాజాగా మార్వాడి యువమంచ్ ఆర్థిక సాయం
– మరింత సాయం అందించాలని ‘శ్రీనన్న’ పిలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న యాలాల మండలం సంగెంకు చెందిన భానుప్రియ, శివకుమార్ దంపతులకు చెందిన 9నెలల వశిష్టకు ఇంకా కొంచెం ఆర్థిక చేయూత అందితే ప్రాణాపాయం నుంచి గట్టెక్కినట్లే. ఇప్పటికే తాండూరుకు చెందిన పలు సంఘాలు, పలువురు దాతలు అందించిన ఆర్థిక సాయంతో బాలుడు శస్త్రచికిత్సకు కావాల్సిన నిధులు సమకూరుతున్నాయి.

తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఎండి సరళా శ్రీనివాస్ రెడ్డిలు తమ వంతుగా బాలుడు కుటుంబానికి రూ. 50వేల ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి చిన్నారి వశిష్ట చికిత్స కోసం అందచేలా చెల్లించాలని పలువురు దాతలను కోరారు. శ్రీనివాస్ రెడ్డి పిలుపు మేరకు పలువురు నగదు రూపంలో రూ.35వేలు, మిగతా 67 వేల రూపాయిలు ఫోన్ పే, గూగూల్ పే, ఆన్ లైన్ ద్వారా చెల్లించారు. తాండూరు కిరాణా మర్చంట్స్ అసోసియేష్ సభ్యులు కూడా శ్రీనివాస్ రెడ్డి స్పూర్తితో రూ. 53వేల 170లను, తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా.శరత్ చంద్ర కూడా రూ. 5వేలు అందజేశారు. అంతకుముందు తాండూరుకు ప్రముఖ వ్యాపారి పటేల్ శ్రీశైలం కూడా రూ. 11వేలు అందజేశారు.

ఇప్పటి వరకు వశిష్ట వైద్యం కోసం సుమారు రూ. 15లక్షలు జమ అయ్యాయి. తాజాగా శనివారం తాండూరు మార్వాడి యువమంచ్ సభ్యులు చిన్నారి కోసం రూ. 31వేలు ఆన్లైన్ ద్వారా చెల్లించారు. అంతేకాకుండా ఆపరేషన్ సమయంలో రక్తం అవసరమైతే సమకూర్చేందుకు సిద్దంగా ఉన్నామని భరోసా అందించారు. చిన్నారిని కాపాడుకోవాలని శ్రీనివాస్ రెడ్డి అందిస్తున్న స్పూర్తితో దాతలు సాయం చేసేందుకు ముందుకు రావడం పట్ల పార్టీ నేతలు, శ్రీనన్న అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదకుటుంబానికి సాయం అందించాలని శ్రీనివాస్ రెడ్డి అందించిన పిలుపుతో చరిత్రలో ఎన్నడు లేని విధంగా సాయం అందిందని కీర్తిస్తున్నారు. మరోవైపు మార్వాడి యువంచ్ అందించిన సాయానికి శ్రీనివాస్ రెడ్డి మంచ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. దాతలు ఇంకా ముందుకు వచ్చి తోచిన సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదికూడా చదవండి…

