బీజేపీకీ నాగారం సేవలు మరువలేనివి..!
– తాండూరులో నర్సింలు విగ్రహా ఏర్పాటుకు తోడ్పాటు
– చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
– కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ పార్టీకి తాండూరు సీనీయర్ నాయకులు, మున్సిపల్ మాజీ చైర్మన్, స్వర్గీయ నాగారం నర్సింలు సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని చేవళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరుకు వచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టణంలోని నాగారం నర్సింలు సతీమణి నాగారం జగదాంబ, కుమారులు నాగారం శ్రీశైలం, నాగారం జగదీశ్వర్, నాగారం మల్లేశంతో పాటు కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఇంట్లో నాగారం నర్సింలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ కొండా మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలో నాగారం నర్సింలు మూల స్థంబంలా ఉండీ నడిపించడంలో ఆయన సేవలు కీలకంగా నిలిచాయన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. తాండూరులో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విగ్రహా ఏర్పాటుకు తనవంతు తోడ్పాటు అందిస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, సీనీయర్ నాయకులు బాలి శివకుమార్, బీఎన్ఎస్ఎల్ కమిటి సభ్యులు గాజుల శాంతుకుమార్, ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్లు సాహు శ్రీలత, బంటారం లావణ్య తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

