క్షయను దాచుకోవద్దు..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

క్షయను దాచుకోవద్దు..!
– అవగాహనతో అరికడదాం
– తాండూరులో క్షయ వ్యాధి దినోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రపంచాన్ని పట్టి పడీంచే క్షయ వ్యాధిని దాచుకోకుండా అవగాహన, చికిత్సతో అరికడదామని జిల్లా ఆసుపత్రి ప్రభుత్వ వైద్యులు అన్నారు. సోమవారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణంలో వైద్య సిబ్బంది, విద్యార్థులతో కలిసి పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. అనంతరం క్షయ వ్యాధి నియంత్రణపై ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ క్షయ వ్యాధిపట్ల అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆలసట, రాత్రివేళ చెమట వంటి లక్షణాలు క్షయ వ్యాధికారి కారకాలు అన్నారు. వ్యాధిని సకాలంలో గుర్తించి వైద్య చికిత్స తీసుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లా అధికారి డా.రవీందర్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో వ్యాధి నియంత్రణకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుందని, దీంతో పాటు మందులు కూడా అందించడం జరుగుతుందన్నారు. కావున బాధితులు వ్యాధిని దాచుకో కుండా చికిత్స, అవగాహనతో నియంత్రణకు తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డా. సమీఉల్లా, డా. గిరిధర్, సూపర్ వైజర్ అంబికా, ఫార్మసిస్ట్ రవికుమార్, హర్షవర్ధన్ రెడ్డి, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషీయన్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఇక పేదలకు సన్న బియ్యం..!