తాండూరు పై మనోహరన్న మార్క్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు పై మనోహరన్న మార్క్..!
– అసెంబ్లీలో అభివృద్ధి, సంక్షేమంపై గళమెత్తడం హర్షణీయం
– సమస్యలపై సుదీర్ఘ ప్రస్తావన చేసిన ఏకైక ఎమ్మెల్యే
– మూడేళ్లలో నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి ఖాయం
– ఎన్ఎస్యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తక్కువ సమయంలోనే తాండూరుపై పూర్తి అవగాహన ఏర్పరుచుకుని నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారని ఎన్ఎస్యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్ అన్నారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తనదైన శైలిలో నియోజకవర్గ సమస్యలపై ప్రస్తావించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

బడ్జెట్ సమావేశంలో విద్యా, రోడ్లు, తాగునీరు, పౌరసరఫరాలు, మహిళల సంక్రమంతో పాటు పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. అసెంబ్లీ సమావేశంలో తాండూరు రోడ్లు, తాగునీటి సరఫరా, చిలుకవాగు, రేషన్ దుకాణాలు, మహిళా సంఘాలకు వరి కొనుగోలు కేంద్రాల అప్పగింత, చిలుకవాగు, గొల్ల చెరువుల ప్రక్షాళన, తాండూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ తదితర అంశాలపై సుదీర్ఘంగా ప్రస్తావించడం తాండూరు రాజకీయాలలో మాట్లాడిన నేతగా అవతరించారని అభివర్ణించారు. కాంగ్రెస్ పాలనలోనే అసెంబ్లీ సమావేశంలో గళమెత్తే స్వేచ్ఛ దక్కిందన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు. నియోజకవర్గంపై చూపిస్తున్న మార్క్ తో వచ్చే మూడేళ్లలో నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి సాధించడం ఖాయమన్నారు.

తాండూరు సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించడం పట్ల ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి. సంక్షేమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి అండగా ఉంటామని అన్నారు. | మరోవైపు 11 రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందరికి అవకాశం కల్పించడం ఆయన తనానికి నిదర్శమని, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ఎన్ఎస్యూఐ సభ్యులు సోషల్ మీడీయాలో విస్తృత ప్రచారంతో జనాల్లోకి తీసుకెళ్లాలనని పిలుపునిచ్చారు.

ఇదికూడా చదవండి…

పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చు