కేవీసీఎస్ విద్యార్థుల ప్రేరణ అద్భుతం
– విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
– కాంగ్రెస్ నాయకులు ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి0
– కేవీసీఎస్ లో విద్యార్థులకు, టీచర్లకు అవార్డులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు క్రిష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ (కేవీసీఎస్) విద్యార్థులు ప్రతిభను కనబరచడం అభినందనీయమని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్కూల్ కు చెందిన విద్యార్థులు ఐఐటీ-నీట్(స్పీడ్ లాబ్)లో మొదటి, రెండో స్థానాలలో నిలిచారు. అదేవిధంగా సీమ్స్ ఒలంపియాడ్(2023-24)లో జాతీయ స్థాయిలో మొదటి స్థానం, లీడ్ చాంపియన్ షిప్(అకడామిక్స్లో ఎక్స్టెన్స్), కోడింగ్ చాంపియన్(లీడ్ స్కూల్) జాతీయ స్థాయిలో 3వ బహుమతి, జోనల్ స్థాయిలో 1వ బహుమతి సాధించారు. దీంతో పాటు స్కూల్ పీఈటీ నవనీత 6వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిఫ్ (హై జంప్) లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా స్కూల్లో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధానోత్సవంలో శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా జాతీయ సైన్స్ ఫేయిర్ లో ప్రతిభను కనబరిచిన టీచర్లకు, విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరుకు చెందిన కేవీసీఎస్ స్కూల్ టీచర్లు, విద్యార్థులు జాతీయ స్థాయి సైన్స్ ఫేయిర్ లో ప్రతిభను చాటటడం, అందరికి ప్రేరణగా నిలవడం అద్భుతమైన ఘట్టం అన్నారు. వారి నైపుణ్యం గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు విద్యార్థులను తమవంతు ప్రోత్సహం అందించి ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.

అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మక విద్యనందించడంతో పాటు సాంకేతిక రంగాల్లో రాణించేలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. మరోవైపు అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో యజమాన్య కమిటి సభ్యులు మల్లేపల్లి వెంకటేశం. డైరెక్టర్ సతీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

