వినాయక వైద్య సేవలు సూపర్
– జుంటుపల్లి జాతరలో వైద్య శిబిరం
– అభినందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలంలోని జుంటుపల్లి సీతారాముల జాతర ఉత్సవాలలో తాండూరు పట్టణం శాంతినగర్ లోని వినాయక సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి యజమాన్యం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరి అభిమానంను సొంతం చేసుకుంది.

గత కొన్ని నెలల క్రితం తాండూరులో ప్రారంభించిన ఆసుపత్రి యజమాన్యం ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు వైద్య సేవలను అందిస్తోంది. తాజాగా ఆదివారం జుంటుపల్లి జాతర ఉత్సవాలలో ఆసుపత్రి నిర్వహకులు, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చిన భక్తులకు ఆసుపత్రి వైద్యులు డా. మాలాశ్రీ, డా. ఆకాంక్ష, శ్రీలత, సంతోష్ రాథోడ్, శ్రీకాంత్, వైద్య సిబ్బంది ఉచితంగా బీపీ, షుగర్, జ్వరం, దగ్గు తదితర అనారోగ్య సమస్యలకు వైద్య సేవలను అందించారు.

ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై ఉచిత వైద్య సేవలను అందించిన ఆసుపత్రి యజమాన్యంను అభినందించారు. పేదలకు కార్పోరేట్ వైద్యం అందుబాటులోకి తేవడంతో పాటు ఉచిత వైద్య సేవలు అందిస్తూ గుర్తింపు పొందడం ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ రాజు, అగ్గనూర్ మాజీ సర్పంచ్ భీమప్ప తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

