ఎంసెట్ అభ్యర్థులకు సూపర్ చాన్స్..!
– ఈనెల 27న ఎంసెట్ మోడల్ పరీక్ష
– సింధు డిగ్రీ కాలేజీలో ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎంసెట్ ఎంట్రెన్ పరీక్ష రాసే అభ్యర్థులకు సూపర్ చాన్స్ ఇచ్చారు తాండూరు సేవా భారతి, హిందూ ధార్మిక పరిషత్, సింధూ డిగ్రీ కాలేజీ ప్రతినిధులు ఓ ప్రకటన చేశారు. ఈనెల 27న తాండూరులో ఎంసెట్(ఎప్ సెట్) మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవా భారతి, హిందూ ధార్మిక పరిషత్, సిందూ డిగ్రీ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పరీక్ష ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఆదివారం పట్టణంలోని సిందూ డిగ్రీ కాలేజీలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఉదయం 9-30గంటలకే విద్యార్థులు తమ ఎంసెట్ హాల్ టికెట్ జిరాక్స్ లతో హాజరు కావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని నిర్వహకులు సూచించారు.
ఇది కూడా చదవండి….

