ఎంసెట్ అభ్యర్థులకు సూచన..!
– ఈనెల 26న ఎంసెట్ మోడల్ పరీక్ష
– హాజరయ్యేందుకు రూల్ ఇదే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎంసెట్ ఎంట్రెన్ పరీక్ష తేది దగ్గర పడుతోంది. ఈక్రమంలో పరీక్షకు సిద్దమవుతున్న అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అభ్యర్థుల్లో ఆ ఒత్తిడికి దూరం చేసేందుకు తాండూరు సేవా భారతి, హిందూ ధార్మిక పరిషత్, పీపుల్స్ డిగ్రీ కాలేజీ ప్రతినిధులు ఓ ప్రకటన చేశారు.

ఈనెల 26న తాండూరులో ఎంసెట్(ఎప్ సెట్) మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవా భారతి, హిందూ ధార్మిక పరిషత్, పీపుల్స్ డిగ్రీ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పరీక్ష ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

శనివారం పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కాలేజీలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఉదయం 9-30గంటలకే విద్యార్థులు తమ ఎంసెట్ హాల్ టికెట్ జిరాక్స్ లతో హాజరు కావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని నిర్వహకులు సూచించారు.
ఇది కూడా చదవండి….

