భూవివాదంలో ఉద్రిక్తత..!
– కోర్టు కేసులోని భూమిలో ప్రహారీ నిర్మాణం
– అడ్డుకున్న భూమి యజమానులు
– రంగ ప్రవేశం చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఓ భూవివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. కోర్టు కేసు నడుస్తున్న భూమిలో ప్రహారి నిర్మాణం చేపట్టడం పట్ల ఇరు వర్గాల మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసుల రంగ ప్రవేశంతో వివాదం కాస్త సద్దుమణించింది.

వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం సర్వేనెంబర్ 128లో బిచ్చాల అరవింద్ పూర్వికులకు సర్వేనెంబర్ 128లో మొత్తం 11 ఎకరాల పైబడి భూమి ఉండగా సేయింట్ మార్క్స్ పాఠశాలకు 26 గుంటలు మినహా మిగితా భూమిని విక్రయించారు. ఆతరువాత సేయింట్ మార్క్స్ పాఠశాల యాజమాన్యం కొద్ది ఏళ్ల క్రితం 3 ఎకరాల పైబడి భూమిని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. ఇదే భూమిని తాండూరుకు చెందిన వ్యక్తులకు బిచ్చాల కుటుంబీకులు విక్రయించారు. 26 గుంటల భూమిపై సేయింట్ మార్క్స్ పాఠశాల యాజమాన్యం, కొనుగోలు చేసిన వ్యక్తుల మద్య వివాదం కొనసాగుతోంంది. ఈ విషయంపై ఇరువర్గాలు కోర్టు వరకు వెళ్లారు. అయితే నాలుగు రోజుల నుంచి వివాదాస్పద భూమి చుట్టూ సేయింట్ మార్క్స్ పాఠశాల యాజమాన్యం ప్రహారీ గోడను నిర్మిస్తోంది. ప్రహారీ నిర్మాణంను భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు మంగళవారం అడ్డుకున్నారు. కొంత మేరకు ప్రహారీని కూల్చివేశారు. సేయింట్ మార్క్స్ పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువురిని తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. కోర్టులో కేసు ఉండగా సేయింట్ మార్క్స్ పాఠశాల యాజమాన్యం ప్రహారీ నిర్మాణం చేయడాన్ని బిచ్చాల అరవింద్‌తో పాటు భూమిని కొనుగోలు చేసిన ఇందూరు మాజీ ఎంపీటీసీ పటేల్ ప్రవీణ్ కుమార్‌లు తప్పుబడుతున్నారు.

ఇది కూడా చదవండి….

