సమాజానికి స్పూర్తిదాయకుడు బసవేశ్వరుడు

తాండూరు రాజకీయం వికారాబాద్

సమాజానికి స్పూర్తిదాయకుడు బసవేశ్వరుడు
– కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
– తాండూరులో జయంతి ఉత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజానికి స్పూర్తి దాయకుడు బసవేశ్వరుడు అని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తాలో జరిగిన బసవేశ్వర జయంతిలో ఆయన పాల్గొన్నారు.

భక్తులు, వీరశైవ సమాజం సభ్యులతో కలిసి బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “జగజ్యోతి బసవేశ్వరుడు ఏ ఒక్క మతానికో, కులానికో పరిమితుడైనవాడు కాడు. వచనాల ద్వారా సమాజానికి చైతన్యం అందించిన మహానుభావుడు,” అని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్, ఆలయ కమిటి సభ్యులు, వీరశైవ సమాజం, వీరశైవ యువదళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి...

ఇంటర్ సప్లిమెంటరీపై ప్రత్యేక దృష్టి