ఎల్లుండి ప్రైవేటు విద్యాసంస్థల బంద్
– గోశాల సమితి విజ్ఞప్తికి సానుకూల స్పందన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎల్లుండి తాండూరులోని ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛంద బంద్ పాటించనున్నాయి. 22న తేదిన అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభత్సవం, శ్రీరామ చంద్రమూర్తి విగ్రహప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని తాండూరులోని గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాలలో ప్రైవేటు విద్యాసంస్థలు అయిన స్కూళ్లు, కాలేజీ యజమాన్యాలను భాగస్వామ్యం చేసేందుకు గోశాల సేవా సమితి సభ్యులు ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ తో చర్చలు జరిపింది.
22న స్వచ్ఛంద బంద్ పాటించి.. సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గోశాల సేవా సమితి విజ్ఞప్తిని ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. దీంతో పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థలు ఎల్లుండి బంద్ ను పాటించబొ తున్నాయి. ఈ సందర్భంగా గోశాల సేవా సమితి అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్, కోశాధికారి ఓం ప్రకాష్ సోమానిలు మాట్లాడుతూ తాండూరులో జరిగే అయోధ్య ఉత్సవాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి…

