తాండూరు మున్సిపల్ కు 79 కుట్టు మిషన్లు

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు మున్సిపల్ కు 79 కుట్టు మిషన్లు
– 20వ తేదిలోపు అర్హులైన లబ్దిదారులను గుర్తించాలి
– తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ నరేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కు 79 కుట్టు మిషన్లు మంజూరయ్యాయని తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ నరేందర్ రెడ్డి తెలిపారు. శనివారం కార్యాలయంలో వికారాబాద్ జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ) రవికుమార్ తో కలిసి ఇంచార్జ్ కమీషనర్ నరేందర్ రెడ్డి మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, మెప్మా ఆర్పీలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంచార్జ్ కమీషనర్ మాట్లాడుతూ మైనార్టీ కార్పోరేషన్ ద్వారా తాండూరు మున్సిపల్ కు 79 కుట్టు వి స్టేషన్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇప్పటికే కుట్టు మిషన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని, ఇందులో అర్హులైన వారిని గుర్తించేందుకు వార్డు ఆఫీసర్లు, ఆర్పీలు దృష్టిసారించాలన్నారు. తెలుపు రేషన్ కార్డు, రూ. 2లక్షల ఆధాయం, 18 ఏండ్ల నుంచి 55లో ఉన్న వారు కుట్టు మిషన్లు పొందేందుకు అర్హులని స్పష్టం చేశారు. అన్ని దృవపత్రాలను పరిశీలించి ఈనెల 20వ తేదిలోపు లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ రాజేంద్ర ప్రసాద్, కోఆర్డినేటర్ విశాల, వార్డు ఆఫీసర్లు, ఆర్పీలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల జాబితా సర్వే