పది వేల మట్టి గణపతులు..!
– ప్రతి ఇంటికి అందజేయడమే లక్ష్యం
– పురపాలక సంఘం ఆధ్వర్యంలో పంపిణీ
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– మట్టి గణపతి..మహా గణపతి పోస్టర్ ఆవిష్కరణ
– హిందూ సంఘటన్ ను అభినందించిన ఎమ్మెల్యే బుయ్యని
తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గుర్తుచేశారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణంలో పది వేల మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేస్తామని వెల్లడించారు.
పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మట్టి గణపతిని ఉచితంగా అందజేస్తామని తెలిపారు. హిందూ సంఘటన్ ఆధ్వర్యంలో రూపొందించిన మట్టి గణపతి..మహా గణపతి పోస్టర్ ను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో డిఎస్పీ బాలక్రిష్ణారెడ్డి, మునిసిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ రవిగౌడ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి, హిందూ ఉత్సవ కేంద్ర సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, తాజా మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ లతో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..పది వేల మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
కుల్కచర్లలో మట్టి విగ్రహాలను తయారు చేస్తున్న వారితో కూడా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈసారి తాండూరుకు పది వేల మట్టి విగ్రహాలను అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్ తో తాను మాట్లాడుతానని అన్నారు. తాండూరులో ఉద్యమ రూపంలో మట్టి విగ్రహాల పంపిణీ చేద్దామని పిలుపునిచ్చారు. మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలనే చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన హిందూ సంఘటన్ ప్రతినిధులు గాజుల బస్వరాజ్, పర్యాద రామక్రిష్ణ, రజనీకాంత్, గీతా సత్సంగ్ చల్లా నారాయణ, సిద్దార్థ నరేందర్, పటేల్ విజయ్, వేణు, ఆర్యసమాజ్ మోహన్, సంతోష్, సంతోష్ అష్తికార్, దేవగారి రమేష్ కుమార్ లను ఎమ్మెల్యే అభినందించారు.
ఇది కూడా చదవండి…

