పేదల సంక్షేమానికి ప్రాధాన్యత
– అనారోగ్యంతో బాధపడే వారికి వరం సీఎంఆర్ఎఫ్
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– 140 మందికి రూ.51 లక్షల ఎల్డీసీల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, తాండూరు మండలాలతో పాటు పట్టణానికి చెందిన 140 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎ ఫ్ కింద ప్రభుత్వం రూ. 51 లక్షల ఎలసీలను మంజూరు చేసింది. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. వివిధ కారణాలతో అనారోగ్యంకు గురై ఆసుపత్రిలో చేరి ఖర్చులు భరించలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకంతో ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని అన్నారు. సీఎంఆర్ఎస్ ద్వారా నిధులు మంజూరు చేస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. అనారోగ్యానికి గురైన పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, కోట్ పల్లి మార్కెట్ చైర్మన్ అంజయ్య, తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, సీనీయర్ నాయకులు డా. సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ ఎంపీపీ శరణు బసప్ప, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు అజయ్ ప్రసాద్, జినుగుర్తి శ్రీనివాస్ గౌడ్, లొంక నర్సింలు, కాంగ్రెస్ పార్టీ పట్టన అధ్యక్షులు హబీబ్ లాల, వివిధ మండలాల ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

