విద్యా, భోజనంకు సర్కారు పెద్దపీట

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యా, భోజనంకు సర్కారు పెద్దపీట
– అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా మౌళిక సదుపాయాలు
– నియోజకవర్గంలోని 256 పాఠశాలలకు వంట పాత్రలు
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, చక్కని భోజనం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మంజూరైన వంట పాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుతవ్ పాఠశాలపై తల్లిదండ్రులకు నమ్మకం పెంచేలా కృషి చేస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా ప్రభుత్వం పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ చేస్తోందని అన్నారు. యూనిఫామ్స్ కూడా అందిస్తుందన్నారు. అమ్మ ఆదరణ కమిటీల ద్వారా పాఠశాలలకు మౌళిక సదుపాయాలను కల్పిస్తోందని అన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని 256 పాఠశాలలకు వంట పాత్రలను పంపిణీ చేసిందన్నారు. దీంతో పాటు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్యా, మెరుగైన భోజనం అందించేందుకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, ఇంటర్మీడియట్ వికారాబాద్ జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్, ఎంఈఓ వెంకటయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టన అధ్యక్షులు హబీబ్ లాల, వివిధ పాఠశాలల హెచ్ఎంలు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పౌష్టికహారంతో టీబీ, హెచ్ఐవీ నియంత్రణ