పకడ్బందీగా భూ భారతి సదస్సులు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పకడ్బందీగా భూ భారతి సదస్సులు..!
– సమస్యల నమోదులో నిర్లక్ష్యం వహించరాదు
– రైతుల ఆర్జీలను పక్కాగా నమోదు చేసుకోవాలి
– తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
– బషీరాబాద్‌ మండలంలో రెవెన్యూ సదస్సుల పరిశీలన
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం బషీరాబాద్‌ మండలం గొట్టుగ కలాన్‌, గంగ్వార్‌లలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సును సబ్ కలెక్టర్ తనిఖి చేశారు. సదస్సులో దరఖాస్తులు ఎన్ని వస్తున్నాయి, వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అని ఆరా తీశారు.

ఈ సందర్బంగా సబ్‌ కలెక్టర్ మాట్లాడుతూ రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని అన్నారు. ఈ సదస్సులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల నమోదులో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏయే సమస్యల పై దరఖాస్తులు వచ్చాయో.. వాటిని సమస్యల వారిగా విభజించాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. రైతుల నుంచి ప్రతి దరఖాస్తులను స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తులపై రైతులకు అర్థమయ్యే రీతిలో తెలియజేయాలన్నారు. తహీసల్దార్ స్థాయిలో పరిష్కారమయ్యే దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. రైతులు కూడా రెవెన్యూ సదస్సులను భూ సమస్యల పరిష్కార వేదికగా భావించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెల 20వ తేది వరకు అన్ని గ్రామాల్లో సదస్సులు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షాహిదాభేగం, డిప్యూటీ తహసీల్దార్ రుక్సానా భేగం, సీనీయర్ అసిస్టెంట్ వెంకటేష్, ఆర్ఐ సుధారాణి, సిబ్బంది ప్రభు, అరుణ్‌, నవీన్, గోవింద్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పేదల సంక్షేమానికి ప్రాధాన్యత