తెలంగాణ ప్ర‌భుత్వంలో గౌడ్‌ల‌కు స‌ముచిత స్థానం

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

తెలంగాణ ప్ర‌భుత్వంలో గౌడ్‌ల‌కు స‌ముచిత స్థానం
– రాష్ట్ర అబ్కారి శాఖ‌ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌
– మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌ను క‌లిసిన జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ ముర‌ళీకృష్ణ‌గౌడ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వం గౌడ్‌ల‌కు స‌ముచిత స్థానం క‌ల్పించింద‌ని రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ అన్నారు. శుక్ర‌వారం శుక్రవారం హైదరాబాద్ లోని రాష్ట్ర అబ్కార్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను వికారాబాద్ జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ ముర‌ళీకృష్ణ‌గౌడ్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్‌గా నూతనంగా

నియమితులైన మురళీ కృష్ణ గౌడ్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ స‌న్మానించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ప్రభుత్వంలో గౌడ్ లకు సమూచిత స్థానం లభిస్తోందని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర విద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు ఉన్నారు.