ఘనంగా బక్రీద్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఘనంగా బక్రీద్..!
– ఈద్గా, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు
– శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : త్యాగనిరతిని చాటే బక్రీద్ పర్వదినాన్ని తాండూరులో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఈద్-ఉల్-జుహా సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాండూరు పట్టణ శివారులోని చెనష్పూర్ రోడ్డు మార్గంతో పాటు ఖాంజాపూర్ గేటు సమీపంలో ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులు తరలివచ్చి సామూహిక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా మత ప్రవక్తలు ఇబ్రహీం అలైసలాం తన కుమారున్ని దైవమార్గంలో బలిఇచ్చేందుకు ఉప్రకమించే త్యాగానికి ప్రతీకగా బక్రీద్ను జరుపుకుంటామని తెలిపారు. ఆ త్యాగాన్ని అందరు మననం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బక్రీద్ పండగ సందర్భంగా చెనెష్పూర్ రోడ్డుమార్గంలోని ఈద్గా వద్ద జరిగిన వేడుకలకు చీఫ్ విప్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డిలు హాజరై ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తంరావు, బీసీ కమీషన్ మాజీ మెంబర్ శుభప్రద్ పటేల్, సీనీయర్ నాయకులు అబ్దుల్ రవూఫ్. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ (నయూం), ఈద్గాకమిటి చైర్మన్ యూసుఫ్ ఖాన్, పలు పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు ఉన్నారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఇదికూడా చదవండి…

పకడ్బందీగా భూ భారతి సదస్సులు..!