రైతుల సంక్షేమమే సర్కారు ధ్యేయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రైతుల సంక్షేమమే సర్కారు ధ్యేయం..!
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– రైతులకు ఉచితంగా కంది విత్తనాల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరుఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు మండలాల రైతులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా కంది విత్తనాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల పంటల సాగు కోసం ప్రభుత్వం రైతు భరోసా అందిస్తుందని అన్నారు. సాగుకు యోగ్యమైన భూములు కలిగిన రైతులందరికి భరోసా నిధులు జమ చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా కంది సాగును ప్రోత్సహించేందుకు విత్తనాలను అందించడం జరుగుతుందన్నారు.

విత్తనాలు కావాల్సిన రైతులు సమీపంలోని రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారులను సంప్రదించి ఉచితంగా పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్రామ్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు ఉదయ్ భాస్కర్ రెడ్డి, ఏడీఏ రుద్రమూర్తి, వివిధ మండలాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ప్రగతి పకడ్బందీగా..!