ఉల్లి రైతులకు శుభవార్త..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఉల్లి రైతులకు శుభవార్త..!
– ఎకరాకు రూ. 8వేల సబ్సీడీ
– దరఖాస్తులకు అవకాశం
– గడువు ఎప్పటి వరకు అంటే..?
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని ఉల్లి రైతులకు అధికారులు శుభవార్త చెప్పారు. ఉల్లి పంట సాగుచేస్తున్న రైతులకు ఎకరాకు రూ. 8వేల సబ్సీడీ సాయం అందించడం జరుగుతుందని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల అధికారి సత్తార్ గారు సూచించారు.

జిల్లా ఉద్యానవన శాఖ ద్వారా ఉల్లి పంట సాగు చేస్తున్న రైతులకు ఉద్యానవన మిషన్ (MIDH) ద్వారా ఎకరాకు రూ.8,000/- చొప్పున ఆర్థిక సహాయం (సబ్సిడీ) అందించబడుతోందని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని పొందాలనుకునే రైతులు పంట వేసిన వెంటనే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద తమ పంట వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.

అనంతరం ఆ వివరాలు ఆన్లైన్‌లో నమోదు చేసిన పిమ్మటే సబ్సిడీ వర్తింపజేయబడుతుందని తెలిపారు. ఈ సబ్సిడీ ఒక రైతుకు కనీసం 1 ఎకరం నుంచి గరిష్ఠంగా 5 ఎకరాల వరకే వర్తిస్తుందని వెల్లడించారు.

గడువు, దరఖాస్తు ఇలా..
ఉల్లి పంట సాగు చేస్తున్న రైతులు సంబంధిత వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి పంటల వివరాలను నమోదు చేసుకోవాలి. అనతరం ఆన్‌లైన్లో పట్టాదారు పాస్‌బుక్ తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు – 2 అందించి దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులకు వారం రోజులలోపు మాత్రమే గడువు ఉందని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులందరూ తప్పకుండా వినియోగించుకోవాలని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల అధికారి సత్తార్ అన్నారు. అదేవిధంగా ఉల్లి ఉత్పత్తికి తోడుగా నిల్వ గోదాముల నిర్మాణం కోసం కూడా సబ్సిడీ అందుబాటులో ఉంది. 25 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గల నిల్వ గోదాం నిర్మాణానికి యూనిట్‌కు రూ.1,25,000/- సబ్సిడీ (50%) అందించబడుతోంది. రైతులు దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

ఇదికూడా చదవండి…

బీసీల రిజర్వేషన్ తరువాతే ఎన్నికలు నిర్వహించాలి